Friday, 8 March 2013

సిద్దిపేట జిల్లా కల తీరేనా?


సిద్దిపేట జిల్లా కల తీరేనా?

(టీన్యూస్ ప్రతినిధి, సిద్దిపేట) రాష్ట్రంలో కొత్తగా తొమ్మిది జిల్లాల ఏర్పాటును పరిశీలిస్తున్నట్టు, ఈ ప్రతిపాదనకు కాంగ్రె స్ అధినేత్రి సోనియాగాంధీ సైతం సుముఖంగా ఉన్నట్టు మంత్రి డొక్క మాణిక్య వరవూపసాద్ ప్రకటించడంతో సిద్దిపేట జిల్లా ఏర్పాటుపై ఇక్కడి ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన జరగాల్సిందేనని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి మాణిక్యవరవూపసాద్ పట్టుదలతో ఉన్నారు. అదే గనకజరిగితే సిద్దిపేట ప్రాంతవాసుల చిరకాల కోరిక జిల్లా కల నెరవేరేఅవకాశాలున్నాయి.

సిద్దిపేట ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తే మెదక్ జిల్లాతోపాటు వరంగల్, కరీంనగర్ జిల్లాల స్వరూపంలోనూ మార్పులు జరగడం ఖాయం. సిద్దిపేట కేంద్రంగా జిల్లా ఏర్పాటు కావాలనేది ఇక్కడి ప్రజల కోరిక. ప్రతీసారీ ఎన్నికల హామీగా సిద్దిపేట జిల్లా ఏర్పాటు ప్రతిపాదన ముందుకొస్తున్న ఆచరణలో మాత్రం అంగుళం కదలికైనా లేకుండా పోయింది.

రాష్ట్రాన్ని పాలించిన ముగ్గు రు ముఖ్యమంవూతులు ఎన్‌టీఆర్, నారా చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖరడ్డిలు హామీ ఇచ్చినా ఇప్పటికీ సిద్దిపేట జిల్లా కలగానే మిగిలింది. మెదక్ జిల్లాలో సిద్దిపేట విసిరివేయబడ్డట్టు ఓ మూలన ఉండటం, జిల్లా కేంద్రమైన సంగాడ్డి ఇక్కడి నుంచి దాదాపు 140 కి.మీ. దూరంలో ఉండటంతో పరిపాలన పరంగా, ఇతరత్ర అవసరాల పరంగా ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఈ ప్రాంత వాసుల సౌలభ్యం కోసం సిద్దిపేట డివిజన్‌లోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌తోపాటు అప్పట్లో ఉన్న రామాయంపేట, వరంగల్ జిల్లాలోని చేర్యాల, కరీంనగర్‌జిల్లాలోని నేరెళ్ళ. ఇందుర్తి నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ 1983లో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్.టి.రామారావుకు ఈ ప్రాంత ప్రజావూపతినిధులు ప్రతిపాదనలు పంపించారు.

ఈ ప్రతిపాదనను పరిశీలిస్తానని, కొత్తజిల్లాలు ఏర్పాటు చేస్తే సిద్దిపేటకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని ఇక్కడి నేతలకు ఎన్‌టీఆర్ మాటఇచ్చారు.

అనంతర పరిణామక్రమంలో తెలంగాణ ఉద్యమం కోసం సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ టీడీపీకి, డిప్యూటీ స్పీకర్ పదవులకు రాజీనామా చేయడంతో ఇక్కడ ఉపఎన్నికలు వచ్చా యి. ఆ క్రమంలోనే గతంలో సిద్దిపేట మునిసిపల్ చైర్మన్‌గా ఉన్న హరిశ్చంవూదను పోటీ చేయాల్సిందిగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు కోరినప్పటికీ, సున్నితంగా తిరస్కరించిన హరిశ్చంద తనకు టిక్కెట్టు వద్దని, ఈప్రాంత ప్రజలు జిల్లా కావాలంటున్నారని, సిద్దిపేట కేం ద్రంగా జిల్లా ఎర్పాటు చేయాలని చంద్రబాబు ను కోరారు.

అందుకు సానుకూలంగా స్పందించిన చంద్రబాబునాయడు రాష్ట్రంలో కొత్త జిల్లా లు ఏర్పాటు చేసే ఆలోచన ఉందని అంటూనే సిద్దిపేట జిల్లా ఏర్పాటుకు ప్రథమ ప్రాధాన్యతనిస్తానని చెప్పారు. 2004లో వైఎస్ రాజశేఖరడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సైతం మంచిర్యాలలో పర్యటిస్తూ మొదటి ప్రాధాన్యతపై మంచిర్యాల, తర్వాత సిద్దిపేట కేంద్రాలుగా జిల్లాల ఏర్పాటుకు పరిశీలన చేస్తున్నట్టు ప్రకటించి తరువాత విరమించుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు చేస్తుండటంతో మరోసారి సిద్దిపేట జిల్లా అంశం ముందుకు వస్తున్నది.

అయితే అప్పటి పరణామాలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. 2009 నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో సిద్దిపేటను ఆనుకుని ఉన్న ఇందూరు, నేరెళ్ల, చేర్యాల నియోజకవర్గాలు గల్లంతయ్యా యి. అయినప్పటికీ సిద్దిపేట డివిజన్‌లోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాలతోపాటు కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్, సిరిసిల్లా నియోజకవర్గాలు, వరంగల్ జిల్లాలో చేర్యాల, శనిగరం ప్రాంతాల, మెదక్ జిల్లాలోని రామాయంపేట తదితర ప్రాంతాలతో సిద్దిపేట కేంద్రం గా జిల్లా ఏర్పాటు చేయాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.

రాష్ర్టంలో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా సిద్దిపేటను ఏర్పాటు చేస్తామని స్థానిక నేతలకు మంత్రి హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈ మేరకు తగిన ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఏది ఏమైనా ఇప్పటికైనా సిద్దిపేట ప్రత్యేక జిల్లాగా ఏర్పడితే ఈ ప్రాంత ప్రజల కల ఫలించినట్టే.

1 comment:

  1. We are urgently in need of kidney donors with the sum of $500,000.00 USD (3 crore) and Also In Foreign currency. Apply Now!,For more info Email: healthc976@gmail.com , Call or whatsapp +91 9945317569

    ReplyDelete